
జనరల్

హర్మూజ్ జలసంధిలో జరిగిన నౌకపై దాడి ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులతో పాటు మొత్తం ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరాన్ రాయబార ప్రతినిధిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి వివరణ కోరింది.
ఈ దాడి నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు, సముద్ర రవాణాపై నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాడికి సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తూ, తదుపరి చర్యలను పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!