
టెక్నాలజీ

గత 8 ఏళ్లుగా ప్రజల కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.. పార్టీ మౌత్‌పీస్‌గా ఉన్న ఛానెళ్లు, పేపర్లు నాకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదు.. నేను ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు.. కక్షగట్టి నన్ను పార్టీ నుంచి బహిష్కరించారు.. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగింది.. ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించేవారిపట్ల వివక్షత చూపించారు.
నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తున్నా.. కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం.. నా లాగే తెలంగాణ ఆడబిడ్డలకు రోషం ఎక్కువ.. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోంది.. కచ్చితంగా గొప్ప రాజకీయశక్తిగా ఎదుగుతా.. మీ కోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతోంది.. దీవించండి.. ఆశీర్వదించండి.. నాతో పాటు నడవండి అంటూ శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!