

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో అంతర్జాతీయ గుర్తింపు పొందబోతోంది. ప్రపంచ సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్, తన కార్యకలాపాలను రాజధానిలో ప్రారంభించేందుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే జనవరి నెలలో ప్రారంభమవనున్న క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యమవుతూ, మైక్రోసాఫ్ట్ 1200 క్యూబిట్ సామర్థ్యంతో కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సంస్థ సుమారు ₹1,772 కోట్ల పెట్టుబడిని పెట్టనుంది.
ఈ సదుపాయం కోసం 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సాంకేతిక భవనం నిర్మించనున్నారు. తొలిదశలో సుమారు 1,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ యువతకు స్థానికంగా ఉన్నత స్థాయి ఐటీ అవకాశాలు లభించనున్నాయి. ఇకపై చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అమరావతిలోనే కెరీర్ అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన తర్వాత మైక్రోసాఫ్ట్‌తో చేసిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఆయన చొరవతో మైక్రోసాఫ్ట్‌తో పాటు గూగుల్, జపాన్‌కు చెందిన ఫుజిసు వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి.
ఫుజిసు (జపాన్) – 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయనుంది.
కేంద్ర ప్రభుత్వం – ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ స్థాపనకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
మైక్రోసాఫ్ట్ & గూగుల్ – అధునాతన క్వాంటమ్ పరిశోధన, డేటా సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం కానున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌లు అమలవడంతో అమరావతి అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో తన స్థానం మరింత బలపరుచుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం కొత్త దశలోకి ప్రవేశించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!