

మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థి మహదేవప్పది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ చేసిన హత్యేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు బెదిరింపులు, అరాచకాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావిస్తే తగిన సమాధానం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదని స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదేనని గుర్తుచేశారు.
మహదేవప్ప మరణానికి కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ నాయకత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!