

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా శుక్రవారం ఆయన కోర్టుకు వచ్చారు. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 30, 2026కు వాయిదా వేసింది.
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నిధుల నుంచి సుమారు రూ.55 కోట్ల బదిలీ జరిగిందని, ఇందులో తప్పనిసరి అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌ను ఏ1గా, అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా, కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా పేర్కొంది. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!