

పదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో తెలంగాణ భారీ అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ నిర్వహించిన భారీ నిరసనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో, నెరవేర్చని హామీలపై ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ నియంతృత్వ పాలన, కుటుంబ పాలన చూశామని, ఆ కాలంలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని తెలిపారు. అందుకే కాంగ్రెస్ మాయ హామీలను నమ్మి ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప కాంగ్రెస్ ఇచ్చిన ఇతర హామీలు అమలు కాలేదని ఆరోపించారు.
“రాష్ట్రంలో గులాబీ జెండా వెళ్లి చేయి గుర్తు వచ్చినా, దోపిడీ మాత్రం ఆగలేదు. ఏ వర్గంలోనూ పెద్దగా మార్పు కనిపించలేదు. పది మంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? భూములు అమ్మకుండా పథకాలు అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి రెండూ కుటుంబ పార్టీలే… అవి అక్రమాలకు ప్రోత్సాహం ఇస్తున్నాయి’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!