

జీహెచ్ఎంసీ పరిపాలనా వ్యవస్థను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌ను మొత్తం 300 వార్డులుగా పునర్విభజించాలని నిర్ణయిస్తూ సోమవారం 266 వ జీవోను విడుదల చేసింది.
ఇప్పటికే జీహెచ్ఎంసీకి 27 కొత్త పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నగరం మరింత పెద్ద మహానగరంగా మారింది. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్లతో పాటు మరో 27 సర్కిళ్లను చేర్చింది. దీంతో మొత్తం సర్కిళ్ల సంఖ్య 57 కి పెరిగింది.
వార్డుల పునర్విభజనలో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం, టౌన్ ప్లానింగ్ శాఖలు గత వారం రోజులుగా ప్రాథమిక పనులను పూర్తిచేశాయి. ఇందులో సరిహద్దుల గుర్తింపు, మ్యాపింగ్, జనాభా డేటా సేకరణ వంటి పనులు ఉన్నాయి.
ప్రభుత్వం అధికారికంగా ఆర్డినెన్స్ జారీ చేయడంతో, జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ సోమవారం నుంచే అధికారికంగా ప్రారంభమయ్యిందని అధికారులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!