
సినిమాలు

కేరళలో యువత మరియు మహిళలు కొత్త మార్పుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తిరువనంతపురం నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన వీ వీ రాజేశ్, డిప్యూటీ మేయర్ ఆశా జి.నాథ్‌కు ఆయన లేఖ రాశారు. ప్రజల నమ్మకం ఇప్పుడు ఎన్డీయే వైపు మారుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు.
కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల ఫిక్సింగ్ రాజకీయాలకు ముగింపు దగ్గర పడిందని ప్రధాని తెలిపారు. ఆ రెండు కూటములు సరైన పాలన అందించలేకపోయాయని విమర్శించారు. వారి పాలనలో అవినీతి, రాజకీయ హింస పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.
.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!