
సినిమాలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. బెంగళూరులోని తన నివాసంలో మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించిన ఆయన, హైకమాండ్ నిర్ణయాన్ని తెలియజేస్తూ కేబినెట్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శివకుమార్, సిద్దరామయ్య కాళ్లు మెక్కి ఆశీర్వాదం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉన్న సిద్దరామయ్య, మధ్యాహ్నం రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రస్తుతం ముంబైలో ఉండటంతో మధ్యాహ్నం తిరిగి వచ్చాక రాజీనామా స్వీకరించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!