
జనరల్

తమిళనాడులో ఆలయాలు, పాఠశాలలు, బస్ స్టాండ్ల సమీపంలోని 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రశంసించారు. తమిళ కుటుంబాలు చాలా కాలంగా ఇలాంటి నిర్ణయాన్ని కోరుకుంటున్నాయని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకున్న విజయ్ ను అభినందించారు.
మద్యం విక్రయాలు ప్రభుత్వ ప్రధాన బాధ్యత కాకూడదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మద్యం నియంత్రణను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 717 దుకాణాల మూసివేత కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే అనంతరం రెండు వారాల్లో ఈ టాస్మాక్ దుకాణాలను మూసివేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!