
గాసిప్స్

రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీకి 2026 ఎన్నికల నేపథ్యంలో మళ్లీ టార్చ్ లైట్ గుర్తును కేటాయించింది. గతంలో 2019 లోక్సభ మరియు 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుపై పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయంపై కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేస్తూ టార్చ్ లైట్ గుర్తు సమాజంలోని చీకట్లను తొలగించి వెలుగులు నింపే సంకేతమని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు లక్ష్యంగా స్థాపించబడిన మక్కల్ నీది మయ్యం ప్రస్తుతం డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కొనసాగుతోంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం పార్టీకి ఉత్సాహాన్ని నింపినట్లు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!