

కల్వకుంట్ల కవిత చిట్‌చాట్‌లో మాట్లాడుతూ మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకుని కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరులో “తెలంగాణ” తప్పనిసరిగా ఉంటుందని, రాష్ట్ర ఆత్మగౌరవం మరియు ప్రాంతీయ భావజాలమే ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, మొదటి ఎంపికగా సిద్దిపేట, రెండో ఎంపికగా బోధన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో తమ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతుందని, భవిష్యత్తులో బీజేపీకి రాష్ట్రంలో స్థానం ఉండదని ఆమె వ్యాఖ్యానించారు.
దాదాపు 50 కమిటీల ద్వారా పార్టీ విధానాలు మరియు నిర్మాణంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని కవిత తెలిపారు. GHMC ఎన్నికల వరకు తాత్కాలిక గుర్తుతో పోటీ చేస్తామని, ఎంపిటిసి మరియు జెడ్పిటిసి ఎన్నికల్లో పొత్తుల అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. యువతకు పార్టీ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు తనతో సంప్రదింపుల్లో ఉన్నారని పేర్కొన్నారు. మహిళా నాయకులను మాత్రమే విమర్శించడం సరైంది కాదని, సామాజిక తెలంగాణ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని, ప్రజల కోణంలో పార్టీని నడిపిస్తామని ఆమె స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!