

నేడు కడప నగరపాలక సంస్థ సర్వసభ్యుల సమావేశం జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత ఏడాదిన్నర కాలంగా మేయర్ వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న కుర్చీ వివాదం ఈ సమావేశానికి కేంద్రబిందువుగా మారింది. గత మూడు సర్వసభ్య సమావేశాల్లో తీవ్ర వాగ్వాదాలు, రసాభస చోటుచేసుకోగా, ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయకపోవడమే ప్రధాన వివాదంగా నిలిచింది.
ఈరోజు సమావేశంలోనూ మరోసారి కుర్చీ వివాదం తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే కడప నగరపాలక మండలికి చివరి సర్వసభ్య సమావేశం కాగా, వచ్చే నెల 15 తో పాలక మండలి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశం ప్రశాంతంగా జరుగుతుందా లేక మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!