
టెక్నాలజీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమల్లో ఉండనుంది అని అధికారులు పేర్కొన్నారు.
అదే సమయంలో, ఈ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా విజయోత్సవాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టంచేశారు. ప్రజా శాంతి భద్రత దృష్ట్యా ఎలాంటి ర్యాలీలు, బైక్ ర్యాలీలు లేదా సెలబ్రేషన్లు నిర్వహించవద్దని హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!