

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ అస్తిత్వం, ప్రగతిని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం సాధించిన విజయాలు మళ్లీ ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్ష శక్తుల నుంచి తెలంగాణను రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణకు రక్షణ కవచంగా నిలుస్తుందని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. దశాబ్దాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, అనేక సవాళ్లను అధిగమించి, ప్రజాస్వామ్య మార్గంలో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. ఆ పోరాటంలో చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!