

తెలంగాణ మాజీ ఐటీ మంత్రి మరియు ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తన సన్నిహిత సంబంధాన్ని మరోసారి స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్లో ఇద్దరూ కలిసి కనిపించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పటిలాగానే జగన్‌ను “జగన్ అన్న” అని పిలుస్తూ తన అభిమానాన్ని కేటీఆర్ వ్యక్తం చేశాడు.
ఈ సమావేశాన్ని మరింత ప్రత్యేకంగా చేసిన విషయం ఏమిటంటే… కేటీఆర్ స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో ఆ ఫొటోలను షేర్ చేసి “Was great meeting @ysjagan Anna at a private event in Bengaluru” అంటూ క్యాప్షన్ ఇవ్వడమే. సాధారణంగా ఇలాంటి ఫోటోలు అనధికారికంగా బయటకు వస్తుంటాయి. కానీ ఈసారి అధికారికంగా పోస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై చర్చ మొదలైంది. ప్రైవేట్ మీటింగ్ అయినప్పటికీ, దానిని పబ్లిక్‌గా షేర్ చేయడం వెనక ఉన్న ఉద్దేశంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!