

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతర్గత పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా పార్టీ బలపడుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం నాయకుల మధ్య విభేదాలు, వర్గపోరు పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే ముందుగా నాయకుల మధ్య ఐక్యత అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో పలువురు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో వేర్వేరు వర్గాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఒకే వేదికపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో నాయకులు విడివిడిగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు రామచందర్రావుకు పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు, నాయకుల మధ్య విభేదాలు, స్థానిక స్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి వంటి అంశాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దితేనే తెలంగాణలో పార్టీ మరింత బలపడుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!