.png&w=3840&q=75)

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తనపై జరిగిన హత్యాయత్నంపై తొలిసారిగా స్పందించారు. తాను జీవితంలో ఎవరికీ హాని చేయలేదని, తనపై ఎందుకు దాడికి ప్రయత్నించారో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత అమిత్ షా బుధవారం సాయంత్రం ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి ఆరా తీశారని వెల్లడించారు.
జమ్మూలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన అబ్దుల్లా, ప్రజల సమస్యలు వినేందుకు తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఒక పెళ్లి వేడుకలో ఈ ఘటన జరిగిందని వివరించిన ఆయన, తన మెడ వెనుక ఏదో వేడిగా తగిలినట్టు అనిపించిందని తెలిపారు. మొదట అది టపాసుల శబ్దమని భావించినా, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వారి అప్రమత్తత వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొంటూ జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోలకు కృతజ్ఞతలు తెలిపారు.









.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!