
జనరల్

రైతు కొనుగోళ్లపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. డిజిటల్ క్యాబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లను పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో కొత్త నిర్ణయాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని అన్నారు.
గతంలో రైతుల పంటలు కొనుగోలు చేయలేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రాన్ని సాకుగా చూపుతున్నారని ఆయన విమర్శించారు. పంట బోనస్, నీటి సమస్యలు, కొనుగోళ్ల పరిమితులు రైతులకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. పెండింగ్ రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!