

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి టీ. హరీశ్ రావు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు సాగునీరు కోరుతున్న సమయంలో ప్రభుత్వం రాజకీయ వ్యాఖ్యలకే పరిమితమవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో అసత్యాలు ఉన్నాయని, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలను ఖండించిన హరీశ్ రావు, ప్రస్తుతం గోదావరిలో తగిన నీటి మట్టం ఉందని, కన్నెపల్లి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాంకేతిక నిపుణులు, ఇరిగేషన్ అధికారులు సూచించిన మార్గాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, మేడిగడ్డ, కాళేశ్వరం అంశాలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని పేర్కొంటూ, రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!