
క్రీడలు

టీవీకే చీఫ్ విజయ్ కార్యాలయానికి తిరిగి వెళ్లిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో ఆయన మళ్లీ లోక్‌భవన్‌కు బయలుదేరారు. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాల మద్దతు లభించగా, వీసీకే మరియు ఐయూఎంఎల్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు ముందుకు వచ్చాయి. ఈ మద్దతు లేఖలతో గవర్నర్‌ను కలిసేందుకు విజయ్ లోక్‌భవన్ వద్దకు చేరుకున్నారు. ప్రారంభంలో గవర్నర్ షెడ్యూల్ కారణంగా అపాయింట్మెంట్ రాకపోయినా, తర్వాత ఆయన తన కేరళ పర్యటనను రద్దు చేసుకుని సాయంత్రం 6.30కి సమయం ఇచ్చారు. దీంతో విజయ్ మళ్లీ వెళ్లి గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖలు అందించనున్నారు మరియు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!