
.jpg&w=3840&q=75)
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభ సందేశం పంపింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో చెల్లింపులు చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
రాజమండ్రి కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ పనితీరు మరింత మెరుగుపడాలని సూచించారు. వర్షాల కారణంగా పంట నష్టపోకుండా ఉండేందుకు రైతు సేవా కేంద్రాల ద్వారా ఉచిత టార్పాలిన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి ముందుగానే అధిక సంఖ్యలో కార్మికులను సిద్ధం చేశామని వివరించారు. తేమ శాతం 17 దాటినా కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా మానవతా దృక్పథంతో ధాన్యాన్ని స్వీకరించాలని ఇప్పటికే మిల్లర్లకు సూచించినట్లు చెప్పారు. సేకరించిన ధాన్యానికి తక్షణమే నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (1)
24 గంటల్లో చెల్లింపులు అన్నది మంచి నిర్ణయం