
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలిసిన సందర్భంగా తీసిన ఫొటోలో కనిపించిన విష్ణు రెడ్డి ప్రస్తుతం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విజయ్ పక్కనే నిలిచిన ఆయన పూర్తి పేరు ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లోని కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లెకు చెందిన విష్ణు రెడ్డి గత 15 ఏళ్లుగా చెన్నైలో గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
విష్ణు రెడ్డి కుటుంబానికి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీవీకే పార్టీ వ్యూహకర్తగా, ఆర్థిక వ్యవహారాల్లో విజయ్‌కు ముఖ్య సహాయకుడిగా విష్ణు రెడ్డి వ్యవహరిస్తున్నారని తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి. విజయ్ సినిమాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!