
గాసిప్స్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ఇవాళ్టి పర్యటనకు సంబంధించిన వివరాలను వైసీపీ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం, ఉదయం 9:30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి జగన్, 10:30 గంటలకు ఇడుపులపాయ లోని ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
ప్రార్థనలు ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన తిరిగి పులివెందుల చేరుకొని, మధ్యాహ్నం 2:00 గంటలకు క్యాంపు కార్యాలయానికి వెళ్తారు. అక్కడ సాయంత్రం 7:00 గంటల వరకు స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలు వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన తన నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!