

2019 నుండి 2024 వరకు తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మాజీ TTD ఈఓ ఏవీ ధర్మారెడ్డిని విచారించిన SIT, ఇప్పుడు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై దృష్టి పెట్టింది. 2019–2023 మధ్య చైర్మన్గా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి ఈ స్కాంలో కీలక పాత్ర పోషించారని, 2022లో కల్తీ నెయ్యి విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని SIT హైకోర్టుకు తెలియజేసింది. కొన్ని రోజుల క్రితమే సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న లంచాలు తీసుకుని నకిలీ నెయ్యి సరఫరాకు సహకరించినట్టు అరెస్ట్ అయ్యాడు.
ఈ వారం తిరుపతిలో విచారణకు హాజరు కావాలని పిలుపు వచ్చినప్పటికీ, ఆరోగ్య కారణాలతో హాజరు కాలేనని సుబ్బారెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే SIT దీన్ని తిరస్కరించి, ఈ 20వ తేదీన హైదరాబాద్లోనే ఆయన నివాసంలో ప్రశ్నించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ విచారణలో ఆయన పాత్ర, సమాచారం వంటి అంశాలను రికార్డు చేయనుంది. సుబ్బారెడ్డికి మొత్తం వ్యవహారం తెలిసినా చర్యలు తీసుకోలేదని SIT భావిస్తోంది కాబట్టి, ఈ విచారణ కేసులో కీలక మలుపు కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైవి సుబ్బారెడ్డి నిందితుడిగా నిలిస్తే, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు రేపే అవకాశం ఉంది. ఎందుకంటే, ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి అతి సన్నిహితుడు, బంధువూ. ఇప్పటికే SIT సుబ్బారెడ్డి మరియు ఆయన భార్య స్వర్ణలత రెడ్డి బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఈ విచారణతో అవినీతి సంబంధాలపై మరిన్ని ఆర్థిక లింకులు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.









.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!