

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమావేశమై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై సమీక్షించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా నిధుల పంపిణీపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పరిపాలన అంశాలపై సమీక్షించాలన్న నిర్ణయం మేరకు ఈ భేటీ జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనులపై ఉప ముఖ్యమంత్రి వివరించి, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడానికి అన్ని పంచాయతీల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే నీటి పారుదల శాఖ పరిధిలోని డ్రైనేజ్ల పూడికతీత అంశాన్ని ప్రస్తావిస్తూ, రైతులు పంటలు వేయకముందే వేసవిలో పనులు పూర్తి చేయాలని కోరారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను కూడా ముఖ్యమంత్రికి తెలియజేసి, అమలు చర్యలపై సమీక్షించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!