
న్యూస్

సినిమా టికెట్ ధరల అంశంపై సీపీఐ నేత నారాయణ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాతలు సిగ్గు లేకుండా టికెట్ ధరలు పెంచాలని కోరుతుంటే, ప్రభుత్వాలు ఆలోచన లేకుండా వాటికి ఆమోదం తెలుపుతున్నాయని ఆయన మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తే నష్టాలు వస్తాయని చెప్పి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని ఆయన అన్నారు.
వందల కోట్లు పెట్టి సినిమాలు తీయమని ఎవరు చెప్పారని ప్రశ్నించిన నారాయణ, సినిమా హాళ్లలో ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు కూడా లేవని విమర్శించారు. సినిమా చూడటానికి వెళ్లిన ప్రజలు వాటర్ బాటిల్, బిస్కెట్లు కూడా తీసుకెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ ధరల పెంపు ప్రజలపై దోపిడీలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!