
జనరల్

కర్ణాటకలో కొత్త మంత్రివర్గం ఖరారైనట్లు సమాచారం. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు గవర్నర్‌ను కోరుతూ అధికారిక లేఖ పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పలువురు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా, డా. జి. పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రతిపాదిత మంత్రివర్గంలో కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జారకిహోళి, కృష్ణ బైరెగౌడ, ప్రియాంక్ ఖర్గే, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే, యతీంద్ర సిద్ధరామయ్య, బైరతి సురేష్, శరణ్ ప్రకాశ్ పాటిల్ వంటి నేతలకు చోటు దక్కినట్లు సమాచారం. ఈ కేబినెట్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!