

తమిళనాడు మాజీ పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి నివాసంలో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు, పాఠశాల స్థాయి పెంపు, నిర్మాణ అనుమతులు ఇప్పిస్తామంటూ భారీగా నగదు వసూలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పేరుతో నమోదుకాని సంస్థను నిర్వహిస్తున్న బి.టి. అరసకుమార్‌ను సీసీబీ గతంలో అరెస్టు చేసింది. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామంటూ ఆయన డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అన్బిల్ మహేశ్ గతంలో తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగినట్లు దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. చెన్నై, తిరుచ్చిలో అన్బిల్ మహేశ్‌కు సంబంధించిన ఆరు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!