

అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను సీఎం వారికి వివరించారు.
మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు తొలి దశలో మూసీ పునరుజ్జీవనాన్ని చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. రివర్‌ఫ్రంట్ అభివృద్ధితో పాటు నైట్ ఎకానమీకి ప్రణాళికలు రూపొందించామని, హైదరాబాద్‌ను పర్యాటక కేంద్రంతో పాటు నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపిన సీఎం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ ప్రతినిధులను కోరారు. అలాగే డిసెంబర్‌లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు వారిని ఆహ్వానించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!