
సినిమాలు

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వ్యవహారంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఆలస్యమవుతోంది. ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బాధితురాలు రోజుకో వీడియో విడుదల చేస్తూ ఆరోపణలను మరింత తీవ్రతరం చేస్తుండగా, రెండు వారాలు గడిచినా కమిటీ నివేదిక ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో కాలయాపన జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై జరిగిన జేఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నివేదిక ఆలస్యం కావడంపై కమిటీ పనితీరును ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో స్పష్టత తీసుకురావాలంటే విచారణను వేగవంతం చేసి త్వరగా నివేదిక సమర్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.










.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!