
జనరల్

న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యకర్తలు “థాలీ బజావో” కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా విధానాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు కోరారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం త్వరితగతిన స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!