

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు, మున్సిపాలిటీలలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో జూమ్ సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. హంగ్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పైచేయి సాధించాలంటూ ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, స్వతంత్రులు మరియు ఇతర పార్టీల కౌన్సిలర్లు వస్తే చేర్చుకోవాలని సూచించారు. 25 కుపైగా హంగ్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌కు అవకాశాలు ఉన్నాయని, ఏడెనిమిది చోట్ల క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీని సవాల్‌గా తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్‌కు మూడు ఓట్ల ఆధిక్యం ఉందని టి పీసీసీ చీఫ్ తెలిపారు. జగిత్యాల అంశంపై జీవన్ రెడ్డితో మీనాక్షి చర్చించి పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!