

ప్రకృతిని ఆరాధించడం, నీటిని పూజించడం మన సంప్రదాయమని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణాకు పవిత్ర హారతి ఇచ్చామని గుర్తుచేస్తూ, నదులను పూజించడం భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పారు. శాసనసభలో సాగునీటి రంగంపై మాట్లాడిన ఆయన, గంగా–కావేరి అనుసంధానం తన ప్రగాఢ ఆకాంక్ష అని వెల్లడించారు. నదుల అనుసంధానం ద్వారా నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఏ పనైనా చిన్న ఆలోచనతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్న సీఎం, గతంలోనే గంగా–కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయని చెప్పారు. తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడం తమ బాధ్యత అని పేర్కొంటూ, రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు ఎన్డీయే లేదా తెలుగుదేశం హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణాకు 100 టీఎంసీలు తీసుకువచ్చామని, వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేసి పూర్తి చేస్తున్నానని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో కాటన్ దొరను ఇప్పటికీ ప్రజలు స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!