

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నెలవారీ సాయంగా మహిళలకు రూ.1,000 అందిస్తుండగా.. ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మొత్తం కలిపి రూ.3,000, సమ్మర్ స్పెషల్గా మరో రూ.2,000 కలిపి ఈ మొత్తాన్ని మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఏప్రిల్-మే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మహిళా లబ్ధిదారులకు ఇస్తున్న నెలవారీ సాయం రూ.2,000కు పెంచుతామని ఒక వీడియో సందేశంలో స్టాలిన్ ప్రకటించారు.
ప్రభుత్వం నెలవారీ అందిస్తున్న రూ.1000 సాయాన్ని అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సాకుతో నిలిపివేసేందుకు బీజేపీ, అన్నాడీఎంకే కుట్ర పన్నుతున్నాయని స్టాలిన్ ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల సాయాన్ని ఒకేసారి కలిపి మహిళల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమ్మర్ స్పెషల్ ఖర్చుల కింద రూ.2,000 అదనంగా ఖాతాలో జమచేసినట్టు చెప్పారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!