

భారత మహిళల క్రీడా ప్రతిభకు కొత్త మైలురాయిని అందించిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి (Sri Charani)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన సత్కారం అందించింది. ఉమెన్ వరల్డ్ కప్‌ను గెలుచుకోవడం ద్వారా దేశ మహిళల సత్తా చాటినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను అభినందించారు. శుక్రవారం ఉదయం శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) తో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరికీ స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “శ్రీచరణి విజయంతో భారత మహిళల క్రీడా ప్రతిభకు కొత్త గుర్తింపు లభించింది. ఆమె సాధన ప్రతి యువ క్రీడాకారిణికి స్ఫూర్తిదాయకం. దేశ గర్వాన్ని పెంచినందుకు ఆమెకు అభినందనలు” అని అన్నారు.
తరువాత శ్రీచరణి, మిథాలీతో కలిసి వరల్డ్ కప్ విజయ క్షణాల గురించి సీఏంకు వివరించారు. సీఎం మరియు మంత్రి లోకేష్, ఇద్దరి సాధనపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా, గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, అలాగే శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆమెను ఆహ్వానించారు.
తరువాత శ్రీచరణి, మిథాలీతో కలిసి మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించారు. సాయంత్రం ఆమె స్వస్థలం కడపకు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి ఘన సత్కారం, విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు.










కామెంట్స్ (2)
Great honor for Sri Charani and Indian women’s cricket!
Milestone in women’s cricket