

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత, జెన్ జీ, ఆల్ఫా తరాలకు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అమరావతిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, అవకాశాలను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఏఐ, క్వాంటమ్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ “యూత్ రైజ్.. ఏపీ రైజెస్” అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు.
అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు.. వైకాపా పాలన రాష్ట్రాభివృద్ధికి నష్టం కలిగించిందని ఆరోపించారు. టీడీపీలో ప్రతి కార్యకర్త నాయకుడేనని, స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను ప్రస్తావించారు. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని, వాటి ద్వారా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!