

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం, పవిత్ర లడ్డు ప్రసాదం — ప్రతి భక్తుడికి ఒక దివ్యమైన అనుభూతి. ఈ రెండింటికోసం కోట్లాది మంది భక్తులు రోజూ తిరుమలకు వచ్చి కష్టాలు మరిచి స్వామిని దర్శించుకుంటారు. అయితే, ఈ పవిత్ర లడ్డు ప్రసాదం కూడా కల్తీగా తయారైందని బీజేపీ నేత లంకా దినకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. లంకా దినకర్ ప్రకారం, వైసీపీ పాలన సమయంలో తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యి అసలు నాణ్యమైనది కాదని, పాలు లేదా వెన్న ఆధారాలు లేకుండానే నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ దర్యాప్తు తెలియజేస్తోందని ఆయన అన్నారు.
ఆయన వివరాల ప్రకారం — “అప్పటి టీటీడీ అధికారులు భోలే బాబా డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థ సుమారు 24 లక్షల కిలోల నెయ్యి ఇచ్చిందని చెబుతోంది. కానీ సీబీఐ విచారణలో ఆ సంస్థ ఎక్కడా పాలు లేదా వెన్న సేకరించిన రికార్డులు లేవని తేలింది. అంటే నకిలీ పదార్థాలతో నెయ్యి తయారు చేసి లడ్డు తయారీలో వాడినట్లు స్పష్టమవుతోంది” అని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే స్పందించిన సంగతి తెలిసిందే. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించారు. ప్రస్తుతం సీబీఐ ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సహా పలువురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు అందరి దృష్టి ఈ కేసు ఏ దిశగా సాగుతుందనే దానిపై ఉంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!