

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు హరీష్ రావు, కేటీఆర్ లకు రాబోయే బిగ్ బాస్ సీజన్ 10 లో చోటు కల్పించాలంటూ నటుడు నాగార్జునకు లేఖ రాశారు. కాంగ్రెస్ నేత, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఎండీ మెట్టు సాయికుమార్ ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేశారు. హరీష్ రావు, కేటీఆర్ లు రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారని.. అబద్దాలు మోసం ఆడటంలో దిట్ట అంటూ లేఖలో పేర్కొన్నారు.
నటుడు నాగార్జునకు రాసిన లేఖలో హరీష్ రావు, కేటీఆర్ లపై ఫిషరీస్ కార్పొరేషన్ ఎండీ మెట్టు సాయి కుమార్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బిల్లా, రంగాలుగా వారిద్దరిని అభివర్ణించారు. ‘బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున గారికి నమస్కారం. మీ టీవీ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరిగిపోయే చక్కటి ఐడియా. బిగ్ బాస్ సీజన్ 10 లో బిల్లా, రంగాలుగా పేరున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికే వీరిద్దరూ రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. అబద్దాలు చెప్పడంలో రికార్డులను బద్దలు కొట్టారు’ అంటూ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసి హరీష్ రావు, కేటీఆర్ లు గిన్నీస్ రికార్డులకెక్కారని లేఖలో ఫిషరీస్ కార్పొరేషన్ ఎండీ ఆరోపించారు. నటనకు నాట్యం నేర్పిన వారు. నవరసాలు పండించడంలో వీరికి వీరే సాటి. ఆస్కార్ ను సైతం ఆశ్చర్య పరిచే నటన వీరిది. తెలంగాణ ప్రజలను మోసం చేసిన పాపం వీరి సొంతం. ఇలాంటి చక్కటి నటులను బిగ్ బాస్ సీజన్ 10 లో అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలతో పాటు యావత్ దేశ ప్రజలకు మంచి వినోదం దొరుకుతుంది. మీ టీఆర్పీ రేటింగ్స్ కూడా అమాంతం పెరుగుతాయి’ అంటూ మెట్టు సాయికుమార్ నాగార్జునకు రాసిన లేఖలో రాసుకొచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!