
గాసిప్స్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ అంచనాల ప్రకారం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికే స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీఎంసీపై ఈసారి కూడా మహాయుతి పట్టు సాధించవచ్చన్న సంకేతాలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాయుతి కూటమి 131 నుంచి 151 వార్డులు గెలుచుకునే అవకాశముందని పేర్కొంటున్నాయి. మరోవైపు శివసేన (యూబీటీ) పార్టీ 58 నుంచి 68 వార్డులకే పరిమితం కావచ్చని అంచనాలు వెల్లడయ్యాయి. అధికారిక ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సి ఉన్నప్పటికీ, ఈ అంచనాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!