

రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీష్ రావు ఆరోపించారు. ఉద్యోగులు పీఆర్సీ కోరితే ఏసీబీ దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఇది ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ, బడా కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం రూ.30 వేల కోట్ల వరకు చెల్లిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తీర్చాలనే మనసు లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు 72 శాతం పీఆర్సీ ఇచ్చి గౌరవించిందని, ప్రస్తుతం ఉద్యోగులు కనీసం అడిగే పరిస్థితి కూడా లేకుండా భయాందోళన వాతావరణం నెలకొందని అన్నారు. రాజకీయ ఈర్ష్యతో సిద్దిపేటలో మెడికల్, వెటర్నరీ కాలేజీల పనులను అడ్డుకుంటూ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి నెట్టేస్తోందని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!