

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా గత ఆగస్టు నెలలో ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం మహిళల్లో విశేష స్పందన తెచ్చుకుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం అందిస్తూ, వారి రోజువారీ ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. ఈ ప్రయోజనం కోసం ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు వచ్చిన ఖర్చును ఆర్టీసీకి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళల జీరో ఫేర్ టికెట్ల కోసం రూ. 400 కోట్ల అదనపు నిధులను విడుదల చేసింది. రెండున్నర నెలల్లో మహిళలు ప్రయాణించిన మొత్తం బిల్లులను ఏపీఎస్ ఆర్టీసీకి పూర్తిగా చెల్లించినట్లు అధికారికంగా ప్రకటించారు.
రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఈ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆర్టీసీ ఎండీకి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. స్త్రీ శక్తి పథకానికి నిధులు విడుదల చేయటంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తోందని అధికారులు వెల్లడించారు.




.jpg&w=3840&q=75)



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!