

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకువెళ్లేందుకు తాజాగా సీఎస్ విజయానంద్ ప్రిలిమినరీ నోటిఫికేషన్లను విడుదల చేశారు.
జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ కాపీలను సిద్ధం చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈరోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల పై విస్తృతంగా చర్చించనున్నారు.
ప్రభుత్వం కొత్త జిల్లాల తో పాటు ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా నోటిఫై చేసింది.
నంద్యాల జిల్లా – బనగానపల్లె
శ్రీ సత్యసాయి జిల్లా – మడకశిర
అనకాపల్లి జిల్లా – నర్సీపట్నం
మదనపల్లె జిల్లా – పీలేరు
ప్రకాశం జిల్లా – అద్దంకి
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సూచనల ప్రకారం, ఈ నోటిఫికేషన్ల పై ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో ఆయా జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా సమర్పించాలి.
కొత్త జిల్లాల ఏర్పాటుతో పలు మండలాల జ్యూరిస్డిక్షన్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం
ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్పు
రాజంపేటను కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కలపడం
బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు డివిజన్ నుంచి చిత్తూరు డివిజన్ కు మార్చడం
కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు నుంచి కావలి డివిజన్‌కు బదిలీ
కలువాయి మండలాన్ని ఆత్మకూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్పు
సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్చడం
మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను కోనసీమ నుంచి తూర్పుగోదావరి జిల్లా కు బదిలీ
ఈ మూడు మండలాలను రామచంద్రాపురం డివిజన్ నుంచి రాజమహేంద్రవరం డివిజన్‌కు మార్పు
సామర్లకోట మండలాన్ని మరో రెవెన్యూ డివిజన్‌కు మార్చుతూ అధికారిక ఉత్తర్వులు జారీ
రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతం చేసేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!