11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..

Writer: Chandrika 01:37 PM, 11 అక్టోబర్, 2026
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో 105కు సవరణలు చేస్తూ జీవో 153ను విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సుల అమలుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

గ్రామీణ స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించాలని స్పష్టం చేసింది. రిజర్వు చేసిన సీట్లు, పదవుల కేటాయింపు, రిజర్వేషన్ల రొటేషన్‌కు సంబంధించి ప్రత్యేక నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. జీవో 153 అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు కూడా ఉత్తర్వులు పంపించింది. ఈ మార్పులు రానున్న పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రైతుతో అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ సస్పెండ్

రైతుతో అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ సస్పెండ్

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వంజీవో 153బీసీ రిజర్వేషన్లుపంచాయతీ ఎన్నికలుస్థానిక సంస్థల ఎన్నికలుగ్రామీణ స్థానిక సంస్థలుడెడికేటెడ్ కమిషన్ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లుపంచాయతీరాజ్ శాఖరాష్ట్ర ఎన్నికల సంఘం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్
జనరల్

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ
సినిమాలు

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన
బిజినెస్

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..
జనరల్

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..

దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

దిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రాజకీయాలు

భారత్‌–జపాన్ స్నేహబంధం మరింత బలోపేతం కావాలి: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

డయాబెటిస్ ప్రారంభ దశను తేలిగ్గా తీసుకోవద్దా? అధ్యయనం ఏం చెబుతోంది?
ఆరోగ్యం

డయాబెటిస్ ప్రారంభ దశను తేలిగ్గా తీసుకోవద్దా? అధ్యయనం ఏం చెబుతోంది?

ఫిలడెల్ఫియా హత్య కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన క్లాడ్ ఏఐ..
టెక్నాలజీ

ఫిలడెల్ఫియా హత్య కేసులో తప్పుడు సమాచారం ఇచ్చిన క్లాడ్ ఏఐ..

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..
రాజకీయాలు

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!