

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలపై కూటమి కసరత్తు కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించి జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల జాబితాను టీడీపీ పార్టీ కార్యాలయం విడుదల చేసింది. ఈ జాబితాలో కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతలకు అవకాశం కల్పించారు.
జిల్లాల వారీగా పదవులను ఆయా పార్టీలకు కేటాయించారు. కొన్ని జిల్లాల్లో జనసేన, మరికొన్ని జిల్లాల్లో బీజేపీ నేతలకు అవకాశం దక్కగా.. పలు జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు, వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించారు. అభ్యర్థుల జాబితా విడుదలతో కూటమిలో పదవుల పంపకాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో అధికారికంగా బాధ్యతలు చేపట్టే నేతలపై ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!