
గాసిప్స్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్' సదస్సు వద్ద యువజన కాంగ్రెస్ పార్టీ అర్ధనగ్న నిరసన ప్రదర్శన తెలపడంపై సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. యూత్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శనను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇలాంటి సదస్సుల్లో వారి తీరు సరికాదని అభిప్రాయపడ్డారు.
మనకు అంతర్గతంగా ఎన్ని విభేదాలు అయినా ఉండవచ్చని, కానీ ప్రపంచ వేదికపై కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అఖిలేష్ యాదవ్ అన్నారు. విదేశీ ప్రతినిధులు, ప్రపంచ ప్రతినిధుల ముందు మన దేశానికి అవమానం కలిగించేలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని అన్నారు. 'ఇండియా' కూటమిలో ఉన్న సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ యూత్ కాంగ్రెస్ తీరును తప్పుబట్టడం గమనార్హం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!