

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన అఖిలేష్‌కు కేటీఆర్, హరీశ్‌రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ త్వరలోనే కేసీఆర్‌ను కూడా కలుస్తారని తెలిపారు. తమ ఆహ్వానం మేరకు స్వయంగా విచ్చేసి, సమయం కేటాయించి, ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు అఖిలేష్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అఖిలేష్ యాదవ్ కూడా కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ స్పందించారు. ఎప్పుడు కలిసినా కేటీఆర్ ఎంతో ఆప్యాయంగా, సొంత మనిషిలా అనిపిస్తారని చెప్పారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతీసారి బీఆర్ఎస్ నాయకులు గౌరవంగా స్వాగతం పలికినట్టు పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒడిదుడుకులు సహజమేనని, ప్రజలు ఒక్కోసారి నాయకులను అంగీకరించి, మరోసారి పునఃపరిశీలనకు అవకాశం ఇస్తారని అన్నారు. ఈ అంశాలపైనే తమ చర్చ ప్రధానంగా సాగిందని వెల్లడించారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!