
సినిమాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో AIADMK చీఫ్ ఎడప్పాడి కె. పళనిస్వామి హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు ₹2,000 ఆర్థిక సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా మహిళలతో పాటు పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అదనంగా, ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత 100 రోజుల నుండి 150 రోజులకు పెంచుతామని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తామని కూడా ప్రకటించారు. DMK ప్రభుత్వాన్ని ‘ఫెయిల్యూర్ మోడల్’ గా విమర్శిస్తూ, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పళనిస్వామి చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!