

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సబర్మతి నది పరివాహక ప్రాంతం ఈ సందర్భంగా రంగుల పతంగులతో కళకళలాడింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులతో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకలకు హాజరైన నరేంద్ర మోడీ మరియు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ లకు గుజరాతీలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. సబర్మతి తీరంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గుజరాత్‌కు చెందిన కళాకారులు అందించిన సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, ప్రధాని మోడీ జర్మనీ ఛాన్సలర్‌తో కలిసి గాలిపటాలను ఎగరవేసి సందడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడికి వచ్చిన సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కైట్ ఫెస్టివల్ గుజరాత్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత బలపరిచిందని నిర్వాహకులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!