

ప్రజాపంపిణీ అవసరాల కోసం సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పౌరసరఫరాలశాఖకు 20 లక్షల టన్నులు, భారత ఆహార సంస్థ (FCI)కు 14 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం నిల్వ చేయాల్సి వస్తుందని మంత్రి వివరించారు. దీనికి తగిన గోడౌన్లు, నిల్వ కేంద్రాలు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచించారు.
సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. బియ్యం సేకరణ, నిల్వ మరియు పంపిణీ ప్రక్రియలపై చర్చించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ, “రాబోయే నెలల్లో ధాన్యం సేకరణ వేగవంతమవుతుంది. నిల్వకు సరైన స్థలాలు సిద్ధం కాకపోతే రవాణా, పంపిణీ సమస్యలు తలెత్తుతాయి. అందుకే గోడౌన్ల పనులను ఇప్పటి నుంచే పూర్తి చేయాలి” అని సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!